టీమిండియాకు హెచ్చరికలు..!

27
- Advertisement -

వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ భారీ విజయాలను నమోదు చేస్తూ ప్రత్యర్థి జట్లను ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇక ఆల్రెడీ సెమీస్ బెర్త్ కన్ఫమ్ చేసుకున్న రోహిత్ సేన లీగ్ దశలో చివరి మ్యాచ్ ను నెదర్లాండ్ తో తలపడనుంది. సెమీస్ ముందు నామమాత్రంగా జరిగే ఈ మ్యాచ్ ను లైట్ తీసుకోవద్దని మాజీలు క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను మట్టికరిపించిన నెదర్లాండ్ ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు మాజీలు.

ఇప్పటివరకు ఛాంపియన్ గా ఆడిన టీమిండియా నెదర్లాండ్ తో జరిగే మ్యాచ్ లోనూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని చెబుతున్నారు విశ్లేషకులు. సెమీస్ ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం ఎంతో ముఖ్యం. అందువల్ల నెదర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేస్తే సెమీస్ లో పూర్తి ఆత్మవిశ్వాసం తో రాణించే అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ వంటి వారు చెబుతున్నారు. ప్రస్తుతం టీమిండియాలో అన్నీ విభాగాలు పటిష్టంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. లలో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది రోహిత్ సేన. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్,.. ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అటు బౌలింగ్ లో మహ్మద్ షమి, బుమ్రా, సిరాజ్.. నిప్పులు చెరిగే బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను బెంబేలెత్తిస్తున్నారు. ఇదే ఫామ్ ఇలాగే కొనసాగితే నెదర్లాండ్ ను చిత్తు చేయడంతో పాటు సెమీస్ లో కూడా తిరుగులేని జట్టుగా నిలిచి ఫైనల్ లో అడుగుపెట్టడం గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.

Also Read:అనుష్క @ భాగమతి 2

- Advertisement -