తొలిరోజు టీమిండియాదే…

239
team india
- Advertisement -

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలిటెస్టు తొలిరోజు ఇంగ్లాండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది భారత్. అశ్విన్ స్పీన్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హడలెత్తిపోయారు.సొంతగడ్డపై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకుని భారీ స్కోరు సాధిద్దామనుకున్న ఇంగ్లాండ్‌కు కోహ్లీ సేన ఝలక్ ఇచ్చింది. ఒక దశలో భారీ స్కోరు ఖాయం అనుకున్న సమయంలో అశ్విన్ స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు.

దీంతో ఇంగ్లాండ్ 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. స్పిన్నర్‌ అశ్విన్‌ (4/60) ,షమి (2/64) సత్తాచాటారు. కెప్టెన్‌ జో రూట్‌ (80),జెన్నింగ్స్‌ (42 ), బెయిర్‌ స్టో (70 )లతో చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చినా.. చివరి సెషన్లో మిగితా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ఆటముగిసే సమయానికి కుర్రన్‌ (24), అండర్సన్‌ (0) క్రీజులో ఉన్నారు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ ఎనిమిదో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. కుక్‌ (13) వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. కెప్టెన్‌ రూట్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఆ జట్టు తిరుగులేని స్థితికి చేరుకుంది. ముఖ్యంగా రూట్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న జెన్నింగ్స్‌.. రూట్‌కు చక్కటి సహకారం అందించాడు. ఒకనొక దశలో ఇంగ్లాండ్‌ కేవలం 3 వికెట్లు కొల్పోయి 200 పరుగల మార్క్ దాటింది. కానీ చివరి సెషన్‌లో ఆరు వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది.

- Advertisement -