భారత్ – ఇంగ్లాండ్ తొలి టీ20…తుది జట్లు ఇవే!

353
ind vs eng
- Advertisement -

భారత్ – ఇంగ్లాండ్ మధ్య నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఇవాళ తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు కీలకంగా తీసుకున్నాయి. అయితే జట్టు కూర్పు కోహ్లీసేనకు ఇబ్బందికరంగా మారింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా దిగుతారని కెప్టెన్ కోహ్లీ వెల్లడించారు.

నటరాజన్‌ లేకపోవడంతో భువీకి చోటు దక్కనుండగా రెండో పేసర్‌గా‌ శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనిలో అవకాశం ఒక్కరి ఉంటుంది. వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్ కీలకం కానున్నారు. మోర్గాన్‌ సేనకు బెన్‌స్టోక్స్‌, సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీ వంటి ఆల్‌రౌండర్లు, జోఫ్రా ఆర్చర్‌, మార్క్‌వుడ్‌, క్రిస్‌ జోర్డాన్‌, ఆదిల్‌ రషీద్‌ వంటి స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు.

ఈ ఏడాది ఇండియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అన్ని జట్లలో ఎవరి బలాలు వారికి ఉన్నాయని, ఇంగ్లండ్ మాత్రం ప్రపంచ నంబర్ 1 జట్టని అన్నాడు.

భారత జట్టు అంచనా…

రోహిత్ శర్మ,కేఎల్ రాహుల్,విరాట్ కోహ్లీ, అయ్యార్/ సూర్యకుమార్ యాదవ్,రిషబ్ పంత్,హార్దిక్ పాండ్యా,వాషింగ్టన్ సుందర్,భువనేశ్వర్ కుమార్,శార్దూల్ ఠాకూల్/దీపక్ చాహర్,చాహల్,నవదీప్/అక్షర్ పటేల్.

ఇంగ్లాండ్ జట్టు అంచనా…

జాసన్ రాయ్,జోస్ బట్లర్,డేవిడ్ మలాన్,బెయిర్ స్టో,ఇయాన్ మోర్గాన్,బెన్ స్టోక్స్,మొయిన్ అలీ,సామ్ కుర్రాన్,జోర్డాన్,జోఫ్రా ఆర్చర్, రషీద్

- Advertisement -