ఆసీస్‌తో పోరుకు కోహ్లీ సేన రెడీ

214
india vs australia schedule 2017
- Advertisement -

టీమిండియా, ఆస్ట్రేలియా సిరీస్‌కు అంతా సిద్దమైంది. రేపటి నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మరోసారి క్రికెట్ ఫీవర్‌తో అభిమానులు ఉగిపోతున్నారు. శ్రీలంక టూర్‌లో అన్ని మ్యాచ్‌లు గెల్చుకుని భారత్ కాన్ఫిడెన్స్‌తో ఉండగా బంగ్లాతో ఓటమితో కంగారులు కుంగిపోయారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న ఆ జట్టుకు భారత్‌ సిరీస్‌ కత్తిమీద సాములా మారింది.

ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్… మొదటి మూడు వన్డేలకు దూరం కాగా అశ్విన్‌, జడేజాలకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఉమేష్‌ యాదవ్‌, షమీలు జట్టులో తిరిగి స్థానం సంపాదించారు. టీమ్‌లో కోహ్లీ, ధోనీ, రోహిత్‌, రాహుల్‌, జాదవ్‌, పాండే, రహానే, హార్ధిక్‌పాండ్యా, శిఖర్‌ ధావన్‌, చౌహాల్‌, భువనేశ్వర్‌, షమీ, కుల్దీప్‌, అక్షర్‌లకు చోటు కల్పించారు. ఇప్పటికే జట్టులో ఉన్న రహానేను రోహిత్ శర్మకు తోడుగా ఓపెనర్ గా పంపించే అవకాశముంది.  ఆసీస్ తో మొత్తం ఐదు వన్డేలు, మూడు టీ- 20 మ్యాచ్ లు ఆడనుంది భారత్.

 india vs australia schedule 2017
బ్యాట్స్ మెన్, బౌలర్లు అందరూ మంచి ఫామ్ లో ఉండడం కూడా భారత్ కు కలిసి వచ్చే అంశం. భారత పర్యటనలో ట్రాక్ రికార్డు కూడా కోహ్లీ సేనకే సానుకూలంగా ఉంది. గతంలో భారత పర్యటనకు వచ్చినపుడు 3-2తేడాతో వన్డే సిరీస్ లో ఓడిపోయింది ఆసీస్‌.దీంతో ఈసారి కూడా సిరీస్ తమదేనన్న ధీమాతో ఉంది టీమిండియా. మ్యాచుల్లో పరుగుల వరద ఖాయమంటున్నరు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.

- Advertisement -