INDvsAUS:గిల్ లేని లోటు కనిపించిందా?

22
- Advertisement -

వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీమిండియాలో మూడో వన్డేలో ఆసీస్ బ్రేక్ వేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్నా మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లను గెలిచి సిరీస్ సొంతం చేసుకున్నప్పటికి మూడో వన్డే గెలిసి క్లీన్ స్వీప్ చేయాలని భావించింది రోహిత్ సేన. కానీ చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూసిన ఆసీస్ ఎట్టకేలకు మూడో మ్యాచ్ లో విజయం సాధించి ఊపిరి పిల్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. .

డేవిడ్ వార్నర్ ( 56 ), మార్ష్ ( 96 ), స్టీవ్ స్మిత్ ( 74 ), లబుశ్చంగే ( 72 ) చెలరేగి ఆడడంతో భారీ స్కోర్ సాధ్యమైంది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా పది వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి కుప్పకూలింది. రోహిత్ శర్మ ( 81 ), విరాట్ కోహ్లీ ( 56 ), శ్రేయస్ అయ్యర్ ( 48 ), రాణించినప్పటికి మిగతా ప్లేయర్స్ పెద్దగా రాణించకపోవడంతో మ్యాచ్ చేజారిపోయింది. మూడో మ్యాచ్ లో భారత బౌలర్స్ కూడా పెద్దగా రాణించలేకపోయారు. బుమ్రా మూడు వికెట్లు తీసి 81 పరుగులు సమర్పించుకున్నాడు, మహ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ తీసి 68 పరుగులు ఇచ్చారు, ఇక ప్రసిద్ద్ కృష్ణ 45 పరుగులు, జడేజా 61 పరుగులు, ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశ పరిచారు.

గిల్ లేని లోటు
ఈ మద్య టీమిండియా స్టార్ యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఆడిన 20 ఇన్నింగ్స్ లలో 72 సగటుతో 5 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. దీన్ని బట్టి గిల్ ఏ రేంజ్ ఫామ్ లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆసీస్ తో జరుగుతున్నా మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ తన ఫామ్ ను కొనసాగించాడు. అయితే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని మూడో వన్డేలో గిల్ కు రెస్ట్ ఇచ్చారు సెలక్టర్లు. దాంతో మూడో వన్డేలో రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ గా వసింగ్టన్ సుందర్ క్రీజ్ లో అడుగు పెట్టాడు. అయితే సుందర్ 18 పరుగులే చేసి ఘోరంగా విఫలం అయ్యాడు. వన్డేలలో నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. గిల్ తన నిలకడతో ఎక్కువ సేపు క్రీజ్ లో ఉంటూ మంచి ఓపెనింగ్ ఇవ్వడంలో చక్కటి ఆటతీరు ప్రదర్శిస్తాడు. దాంతో మూడో వన్డేలో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని, అందుకే మ్యాచ్ ఓడిపోయామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:అనుకున్నదకటి.. అవుతోందికొకటి ?

- Advertisement -