ఆల్‌రౌండ్‌ ‘షో’ అదిరింది..!

175
India vs Australia, Highlights cricket score
- Advertisement -

భారత్‌-ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. అంచనాలకు తగ్గట్లే రెండు జట్లూ తొలి వన్డేలో హోరాహోరీగా తలపడ్డాయి. అయితే వరుణుడి బారిన పడిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ప్రకారం 26 పరుగుల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి న ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికె ట్లకు 281 పరుగులు చేసింది. అనంతరం వ ర్షం అడ్డురావడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబం ధన ప్రకారం ఆసీస్‌ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులు నిర్ణయించారు. అయితే స్మిత్‌ సేన అన్ని ఓవర్లు ఆడి 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ హార్దిక్‌ పాండ్యా (66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 83)ధనాధన్‌ బ్యాటింగ్‌కు ధోనీ (88 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ తోడవడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. చివర్లో భువనేశ్వర్‌ (32 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. రోహిత్‌ (28), కేదార్‌ (40) రాణించగా, కోహ్లీ (0), రహానె (5), పాండే (0) తీవ్రంగా నిరాశపరిచారు.

ఆసీస్‌ బౌలర్లలో కల్టర్‌ నైల్‌ (3/44), స్టొయినిస్‌ (2/54) మెరుగైన ప్రదర్శన చేశారు. లక్ష్య ఛేదనలో ఆసీస్‌ జట్టులో వార్నర్‌ (28 బంతుల్లో రెండు ఫోర్లతో 25), మాక్స్‌వెల్‌ (18 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 39), ఫాల్క్‌నర్‌ (25 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌తో 32 నాటౌల్‌) మినహా అంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో చాహల్‌ (3/30) మూడు వికెట్లతో ఆసీస్‌ పనిపట్టగా..పాండ్యా (2/28), కుల్దీప్‌ (2/33) సత్తా చాటారు. రెండో వన్డే ఈనెల 21న కోల్‌కతాలో జరగనుంది.

- Advertisement -