టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ..

243
- Advertisement -

భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు టీమ్స్ 2-2తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. సిరీస్ విజేతను తేల్చే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నది.

షాన్ మార్ష్ స్థానంలో స్టాయినిస్, బెహ్రండార్ఫ్ స్థానంలో నేథన్ లయన్ టీమ్‌లోకి వచ్చారు. ఇటు టీమిండియా కూడా రెండు మార్పులు చేసింది. చాహల్ స్థానంలో జడేజా, రాహుల్ స్థానంలో షమి టీమ్‌లోకి వచ్చారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు 21 ఓవర్లు ముగిసేనాటికి 1వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జాదవ్, విజయ్ శంకర్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా.

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆష్టన్ టర్నర్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, జై రిచర్డ్‌సన్, ఆడం జంపా, నాథన్ లయన్, మార్కస్ స్టోనిస్.

- Advertisement -