కేంద్రం సహకరించకున్నా తెలంగాణ టాప్‌..

41
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా తెలంగాణ దేశంలోనే టాప్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ఇండియా టుడే న్యూస్ డైరెక్ట‌ర్‌ రాహుల్ క‌న్వ‌ల్‌ తో ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్..కోవిడ్ ఉన్నా.. నోట్ల ర‌ద్దు చేసినా.. కేంద్రం స‌హ‌క‌రించ‌కున్నా.. తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకువెళ్తున్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు.

దేశంలో అత్య‌ధిక వృద్ధి రేటు తెలంగాణ‌లోనే ఉన్న‌ట్లు తెలిపారు. ఒక‌వేళ తెలంగాణ త‌ర‌హాలో మిగితా రాష్ట్రాల‌న్నీ ప‌రిపాల‌న సాగిస్తే, మ‌న దేశం ఎప్పుడో 5 ట్ర‌లియ‌న్ల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మారేదన్నారు. గ‌డిచిన 8 ఏళ్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్ర ఖ‌జానాకు 3 ల‌క్ష‌ల 68 వేల కోట్లు స‌మ‌ర్పించింద‌ని, కానీ త‌మ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి వ‌చ్చింది కేవ‌లం ల‌క్షా 68 వేల కోట్లే అని తెలిపారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలంగాణ‌పై చెబుతున్న అంకెలు అవాస్త‌వ‌మ‌న్నారు. అత్య‌ధిక ద్రవ్యోల్బ‌ణం, నిరుద్యోగం ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు సూచ‌న‌లు చేయ‌డం జోక్ అవుతుంద‌న్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -