టీ20 వరల్డ్‌కప్‌..భారత జట్టు ప్రకటన!

9
- Advertisement -

ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా రెండు నెలల కన్నా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, అజిత్ అగర్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు సంబంధించిన భారత జట్టును ఖరారు చేయనున్నారు.

అదే సమావేశంలో వచ్చే నెల భారత్‌లో జరగనున్న న్యూజిలాండ్‌తో వైట్-బాల్ సిరీస్కు సంబంధించిన జట్టును కూడా ప్రకటించనున్నారు. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటోంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్‌లో జరగనుంది.

ఈ సందర్భంగా బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ శనివారం ముంబైలోని బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశమై, న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మరియు 2026 ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్‌కు భారత జట్టును ఎంపిక చేస్తుంది. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు అని బీసీసీఐ తెలిపింది.

T20 వరల్డ్ కప్‌కు ముందు, జనవరి 11 నుంచి 31 వరకు భారత్ న్యూజిలాండ్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ వైట్-బాల్ సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి.ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ 10వ ఎడిషన్ T20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 29 రోజుల పాటు భారత్, శ్రీలంకలలోని ఎనిమిది వేదికల్లో హై-ఇంటెన్సిటీ మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన భారత్‌ను గ్రూప్ Aలో ఉంచారు. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు USA, నమీబియా, నెదర్లాండ్స్, మాజీ ఛాంపియన్ పాకిస్థాన్ ఉన్నాయి.భారత్ ఈ టోర్నమెంట్‌కు శ్రీలంకతో కలిసి సహ-ఆతిథ్య దేశంగా ఉంది.

Also Read:TTD:29 నుండి తెప్పోత్సవాలు

- Advertisement -