కోహ్లీకి రెస్ట్‌…రోహిత్‌ చేతికి టీ20 పగ్గాలు

493
team india
- Advertisement -

నవంబర్ 3 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు సెలక్టర్లు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మ చేతికి టీ20 పగ్గాలు అప్పజెప్పారు. టీ20 జట్టులో శివమ్ దూబే, సంజు శాంసన్, చాహల్‌కు చోటుదక్కింది.

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో శివమ్ దూబేకి అవకాశం దక్కగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి మరో అవకాశం దక్కింది. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజాకి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు.. ఫాస్ట్ బౌలర్ నవదీప్ షైనీపై వేటు వేశారు. టెస్టు జట్టులో మాత్రం భారత సెలక్టర్లు ఎలాంటి మార్పులు చేయలేదు.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజుశాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్‌ పాండ్య, చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్ధూల్ ఠాకూర్

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్, రిషబ్ పంత్

- Advertisement -