దక్షిణాఫ్రికాతో టీ20..భారత జట్టు ఇదే

620
india vs south africa
- Advertisement -

వెస్టిండీస్‌ టూర్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా తర్వాత దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 15 నుంచి మూడు టీ20ల సిరీస్ మొదలుకానుండగా టీమ్‌ని ప్రకటించారు సెలక్టర్లు. 15 మందితో జట్టును ఎంపికచేయగా పేస్ బౌలర్లు బుమ్రా,భువనేశ్వర్‌కు రెస్ట్ ఇచ్చారు.

ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు బాదిన శ్రేయాస్ అయ్యర్‌కు బెర్త్ కన్ఫామ్‌ అయింది. ప్రపంచకప్ తర్వాత రెండు నెలల విశ్రాంతిలో ఉన్న ధోని పక్కనపెట్టారు సెలక్టర్లు.

సెప్టెంబరు 15న తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. 18న మొహాలి, 22న బెంగళూరు వేదికగా మిగిలిన రెండు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత అక్టోబరు 2 నుంచి మూడు టెస్టుల సిరీస్ మొదలుకానుంది.

భారత టీ20 జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ

- Advertisement -