సొంత గడ్డపై న్యూజిలాండ్ జట్టును టెస్ట్, వన్డే సిరీస్ ల్లో చిత్తు చేసిన భారత్,,తదుపరి ఇంగ్లాండ్ తో సమరానికి సిద్ధమవుతోంది. భారత పర్యటనకు రానున్న ఇంగ్లాడ్ జట్టుతో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు,, మూడు వన్డే మ్యాచ్, మూడు టీ ట్వంటీ మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌లో మొదలుకుని,,ఫిబ్రవరి వరకు సుదీర్గ పర్యటన కొనసాగనుంది. ఈనేపథ్యంలో మొదట జరిగే టెస్ట్ సిరీస్ కు టీం సభ్యులను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.
ఐదు టెస్ట్ సిరీస్ లో భాగంగా ముందుగా మొదటి, రెండు టెస్ట్ మ్యాచ్‌లకు జట్టు సభ్యులను ఎంపిక చేసింది బీసీసీఐ. విరాట్ కోహ్లి సారథ్యంలోని 15మంది జట్టు సభ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసిన సభ్యులనే స్వల్ప మార్పులతో ఫైనల్ చేసింది. న్యూజిలాండ్ సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్ ఆడిన గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా తొలిసారి టెస్ట్‌జట్టుకు ఎంపిక కావడం విశేషం. గాయం కారణంగా రోహిత్ శర్మ చోటు కోల్పోయాడు.
నవంబర్ 9న రాజ్ కోట్ లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగునుంది. నవంబర్ 17న జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కు విశాఖ వేదిక కానుంది. టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ చేసి,,,టెస్ట్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్న భారత్,,ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో కూడా తన జైత్ర కొనసాగించాలని చూస్తోంది. త్వరలోనే ఇంగ్లాండ్ టీం,,భారత్‌లో అడుగుపెట్టనుంది.
మొదటి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు: విరాట్ కోహ్లీ, రహానె, ఇషాంత్ శర్మ, చటేశ్వర పూజారా, గౌతమ్ గంభీర్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వర్దమాన్ సాహా, కరుణ్ నాయర్, మురళీ విజయ్, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య.