దేశంలో కొత్తగా 40,715 మందికి కరోనా..

250
corona
- Advertisement -

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దివారాలుగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌ విడుదల చేసింది. వాటి ప్రకారం.. 24 గంట‌ల్లో కొత్త‌గా 40,715 మందికి కరోనా నిర్ధారణ అయింది. 29,785 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 199 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది.

కాగా, ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు. 3,45,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -