దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు..

184
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 38,948 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,27,621కి చేరింది. అలాగే, నిన్న 43,903 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 219 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,752కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,81,995 మంది కోలుకున్నారు. 4,04,874 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 68,75,41,762 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 5 వరకు 53,14,68,867 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR‌) ప్రకటించింది. ఇందులో ఆదివారం 14,10,649 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.

- Advertisement -