అక్టోబర్ 10 వరకు….వర్షాలు!

500
imd rains
- Advertisement -

గత ఐదేళ్లుగా దేశంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువే నమోదవుతోంది. కానీ ఈసారి మాత్రం వర్షాలు విస్తారంగా కురిశాయి. కొన్ని చోట్ల కుంభవృష్టి కురవగా మరికొన్నిచోట్ల సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టులన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే వాస్తవానికి నైరుతి తిరోగమన కాలం సెప్టెంబరు 1న మొదలై 30 నాటికి దేశం నుంచి వెళ్లిపోతాయి. ఈ ఏడాది మాత్రం రుతుపవనాల తిరోగమన కాలం ఇంకా ప్రారంభకాకపోవడం విశేషం.

సెప్టెంబ‌ర్ 30వ తేదీతో సీజ‌న్ ముగిసినా.. ఈసారి నైరుతీ ప్ర‌భావం అక్టోబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్టు ఐఎండీ పేర్కొంది. అక్టోబరు రెండోవారంలో పశ్చిమ రాజస్థాన్‌ నుంచి రుతుపవనాల ఉపసంహరణ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.

రుతుపవనాలు మొదలైన నాటి నుంచి సెప్టెంబరు 26 వరకు దేశవ్యాప్తంగా 107 శాతం వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే ఎక్కువ.ఈసారి ఈశాన్య రుతుపవనాలు కూడా బలంగా ఉండబోతున్నాయని దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు, మధ్య కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

rains

- Advertisement -