- Advertisement -
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ షెడ్యూల్‌ని విడుదల చేసింది. 2030 వరకు భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. 2020 ఏడాదిలో సూర్యునిపై పరిశోధనకు ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం చేయనుంది. 2030న అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ఇస్రో రూపకల్పన చేసింది.
2021లో గగన్‌యాన్ పేరుతో మానవ సహిత ప్రయోగం, 2024లో చంద్రయాన్-3, మంగళ్‌యాన్-2 ప్రయోగం చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. 2025లో శుక్రునిపై అధ్యయనం కోసం శుక్రయాన్ ఉపగ్రహ ప్రయోగం చేయనుంది.
- Advertisement -