ఆ పేరుతో పిలిస్తే నాకు చాలా ఇష్టంః రోహిత్ శ‌ర్మ‌

236
Rohit-Sharma
- Advertisement -

టీంఇండియా  ఓపెన‌ర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శ‌ర్మ మొన్న ఇంగ్లాండ్ తో జ‌రిగిన చివ‌రి టీ20లో సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. 2-1 తేడాతో ఇండియా సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. త‌న అద్బుతమైన షాట్ల‌తో మ్యాచ్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు రోహిత్ శ‌ర్మ‌. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఇంకా 8బంతులు మిగిలిఉండ‌గానే విజ‌యం సాధించింది టీం ఇండియా. ఈసంద‌ర్భంగా రోహిత్ శ‌ర్మ ఓ ఇంట‌ర్యూలో పాల్గోని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

rohit sharma

రోహిత్ ఆట‌తీర‌కు అభిమానులు ఫిదా అయిపోతారు. రోహిత్ ను త‌న అభిమానులు, మిగ‌తా ప్లేయ‌ర్లు ఆయ‌న‌ను హిట్ మాన్ అని పిలుచుకుంటారు. అత‌ని పేరు రోహిత్ కాబట్టే అత‌నిని రో హిట్ గా పిలుచుకుంటారు. తాజాగా ఓ ఇంట‌ర్యూలో పాల్గోన్న ఆయ‌న ఈవిష‌యంపై స్పందించారు. ఈపేరంటే త‌న‌కూ చాలా ఇష్టం అని..చాలా మంది అభిమానులు త‌న‌ను హిట్ మ్యాన్ అని పిలుస్తుంటార‌న్నారు.

ROHITSHARMA

టీ20మ్యాచ్లో తాను ఇప్ప‌టివ‌ర‌కూ 3 సెంచ‌రీలు చేసాన‌ని చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఈ మూడు సెంచ‌రీలు త‌న‌కు చాలా ప్ర‌త్యేక‌మ‌న్నారు. అంతేకాకుండా టీ20ల్లో 2000వేల ప‌రుగులు చేసిందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. అంతేకాకుండా త‌న‌పై ఇంకొ రూమ‌ర్ కూడా ప్ర‌చారం జ‌రుగుతుంద‌న్నారు. త‌న భార్య రితీక గ్యాల‌రీలో ఉన్న‌ప్పుడే తాను సెంచ‌రీలు చేస్తాన‌ని ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని కానీ..ఆమె ప్ర‌స్తుతం ఇండియాలోనే ఉంద‌న్నారు. కొన్ని రోజుల్లో ఇంగ్లండ్ కు వ‌స్తుంద‌న్నారు రోహిత్ శ‌ర్మ‌.

- Advertisement -