భారత్ సర్జికల్ దాడులను ఒప్పుకోలేక సతమతం అవుతున్న పాకిస్థాన్ భారత్‌పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ ప్రభుత్వం, సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాదుల కదలికలను గమనించిన నిఘా వర్గాలు ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖకు అందించాయి. దీని ప్రకారం.. ఆత్మరక్షణ, ప్రతీకార దాడి, స్వదేశంలో ప్రతిష్ఠను మళ్లీ పెంచుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి సారించింది.
భారత్ జరిపిన మెరుపు దాడులకు దసరా వేడుకల్లో సమాధానం చెప్పాలని పాక్ ప్లాన్ చేస్తోంది. దసరా సమయంలో ఈ ప్రణాళికను అమలు చేయడం ద్వారా భారీ ప్రాణ నష్టం కలిగించాలనేది ఐఎస్ఐ యోచన. నిఘా వర్గాల నివేదికను అందుకున్న కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా కోస్టుగార్డు దళాలను అప్రమత్తం చేసింది.
భారత కమెండోలు జరిపిన లక్షిత దాడులు పాకిస్థాన్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాయి. భారత్‌లో చొరబడి, నరమేథాన్ని సృష్టించటం కోసం పాక్‌ఆక్రమిత కశ్మీర్‌లో శిక్షణ పొందుతున్న వందలాదిమంది ఉగ్రవాదులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయినట్లు నిఘావర్గాలు పేర్కొన్నాయి. జైషేమహమ్మద్, లష్కరేతోయిబా, హిజ్‌బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాదసంస్థలకు చెందిన 300 మందికిపైగా ముష్కరులు శిక్షణను వదిలిపెట్టి పారిపోయినట్లు తెలుస్తున్నది.
పాకిస్థాన్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో భారత్ వేసిన ఎత్తుతో ఒంటరిదైపోయింది. మరోవైపు మోదీ బలూచిస్థాన్ అంశాన్ని లేవనెత్తడంతో ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు కూడా పాక్ సైన్యం అరాచకాలపై తిరగబడుతున్నారు. వీధుల్లోకి వచ్చి పాక్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పీవోకేలోని కోట్లి ప్రజలు పాక్ ఆర్మీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అరాచకాలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. స్వాతంత్ర్యం కోసం ఉద్యమిస్తున్న నేతల హత్యలు, నకిలీ ఎన్‌కౌంటర్లు, హింసను వ్యతిరేకిస్తూ పాక్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు.
https://youtu.be/UI_Oy6Xbko4