వాట్సాప్‌ బ్యాన్‌… మెటా సంస్థ

91
whatsapp
- Advertisement -


భారత్ లో సెల్‌పోన్‌ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశ జనాభా 108 కోట్లు. కాని ప్రతి ఇద్దరిలో ఒకరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే చాలామంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారని… వాట్సాప్‌ భారతీయ వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. మెటా సారథ్యంలోని వాట్సాప్‌ గతేడాదిలో భారీ స్థాయిలో భారతీయ అకౌంట్లను నిషేధించింది. 2021, జూలైలో గరిష్ఠంగా 30.27లక్షల ఖాతాలపై బ్యాన్‌ విధించింది. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నియమాలను పాటించకపోవడంతో బ్యాన్ చేసినట్లు ప్రకటించింది.

అశ్లీల కంటెంట్‌, పరువు నష్టం కలిగించే, బెదిరింపులు, విద్వేషం, హింసను ప్రేరేపించే కంటెంట్‌ను షేర్‌ చేస్తున్నారని, వాటిని షేర్‌ చేస్తే చర్యలుంటాయని వాట్సాప్‌ హెచ్చరించింది. యూజర్లలో ఎవరి నుంచైనా నెగెటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అందితే.. ఆయా ఖాతాలను నిషేధించనున్నట్లు సైబర్‌ వ్యవహారాల నిపుణుడు, సైబ్రోటెక్ ప్రెసిడెంట్ అనూజ్ అగర్వాల్ పేర్కొన్నారు.

- Advertisement -