2023లో జరగనున్న ఆసియా కప్ పోటీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వేళ్లదని బీసీసీఐ సెక్రటరీ జేషా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ పాకిస్థాన్‌కు బదులుగా తటస్థ వేదికపై జరుగుతుందని స్పష్టం చేశారు. మా జట్టును పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. కాబట్టి మేం దానిపై వ్యాఖ్యానించలేమని జేషా అన్నారు.
2023లో జరిగే ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరుగనుంది. అంతకుముందు ఆసియా కప్ 2023 కోసం పాకిస్థాన్‌కు టీమిండియాను పంపించడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని జేషా ఖండించారు. 2023 ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగనుండగా.. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్ ఇండియాలో జరగనుంది.
గత తొమ్మిదేళ్లుగా ఇండియా, పాక్ జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత జట్టు పాక్‌లో పర్యటించలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌లో మాత్రమే ఇరుజట్లు తలపడతున్నాయి.