- Advertisement -
భారత బౌలర్ల శ్రమ వృధా అయింది. గెలుపు లాంఛనమే అనుకున్న తరుణంలో గొడలా అడ్డుపడ్డారు న్యూలిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్. 52 బంతుల పాటు భారత బౌలర్లను ఎదుర్కొని తొలి టెస్టును డ్రాగా ముగించారు.
ఐదోరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (146 బంతుల్లో 52; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఒక్క వికెట్ తీస్తే గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో రచిన్ రవీంద్ర (91 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు), ఎజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్) కలిసి భారత్‌కు చివరి వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు.
వెలుతురు తగ్గడంతో నిర్ణీత సమయంకంటే 12 నిమిషాల ముందే (కనీసం మరో 3 ఓవర్లు పడేవి) అంపైర్లు ఆటను నిలిపివేశారు. సెంచరీ, అర్ధ సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచారు.
- Advertisement -