మోదీ ది బాస్ : ఆంథోనీ అల్బనీస్‌

31
- Advertisement -

భారత ప్రధాని మోదీ ఫసిఫిక్ మహాసముద్రంలోని వివిధ దేశాల పర్యటనలో భాగంగా ఆపూర్వమైన ఘన స్వాగతం లభిస్తోంది. పుపువా న్యూగినియా, ఫిజీ దేశాల ప్రధాని మోదీకి దేశ అత్యున్నత పురస్కారంలు అందజేశారు. అయితే తాజాగా మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీకి వెళ్లిన మోదీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా  సిడ్నీలో జరుగుతున్న గ్రాండ్ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రధాని మోదీని ది బాస్ అని సంభోందించారు.  సిడ్నీలోని ఖుడోస్ బ్యాంక్ ఎరీనాలో వేలాది ప్రవాసుల మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిరేకితిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పీఎం మాట్లాడుతూ..రాక్ స్టార్‌ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చారు. అంతేకాదు ఈ వేదికపై చివరిసారిగా బ్రూస్ స్ప్రింగ్‌స్టాన్‌కు లభించని గౌరవం ప్రధాని మోదీకి దక్కిందనన్నారు. అలాగే ఇరుదేశాల సాంస్కృతిక చరిత్ర గురించి మాట్లాడారు. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న క్రికెట్ బంధం గురించి చెప్పుకొచ్చారు.

Also Read: యూపీఎస్సీ-2022 ఫలితాలు విడుదల

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ…ప్రధానిగా ఆల్బనీస్ ఎన్నికయ్యే నాటి నుంచి ఇప్పటివరకూ మేము 6సార్లు కలుసుకున్నామని అన్నారు. వ్యూహాత్మకమైన భాగస్వామ్యం కోసం ఇరుదేశాలు కృషి చేస్తున్నాయనన్నారు. ఈ సందర్భంగా మోదీ లెజెండరీ క్రికెటర్‌ షేన్వార్న్ గురించి మాట్లాడారు. ఆస్ట్రేలియా అత్యంత జనాదరణ పొందిన దేశమని కొనియాడారు. ఇది హిందూ మహాసముద్రంలో ఒక ముఖ్యమైన పొరుగు దేశమని దీంతో క్వాడ్ గ్రూప్‌లో భాగస్వామ్యమయ్యామని అన్నారు.

Also Read: మే23:ప్రపంచ తాబేళ్ల దినోత్సవం

- Advertisement -