- Advertisement -
సుష్మాస్వరాజ్ మరణం తనను కలచివేసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ అన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా సేవలను గుర్తు చేసుకున్న ఇవాంక…భారత్ గొప్ప నేతను కొల్పోయిందన్నారు. ప్రజా సేవలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుందన్నారు.భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆమె ఓ ఛాంపియన్. ఆమెతో పరిచయం ఉండటం గౌరవంగా భావిస్తున్నా’ అని ఇవాంక ట్వీట్ చేశారు.
గతంలో సుష్మా-ఇవాంక ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా కలిశారు. ఈ సందర్భంగా సుష్మాపై ఇవాంక ప్రశంసలు గుప్పించారు. భారత దేశానికి చెందిన, ఛరిష్మా కలిగిన సుష్మా స్వరాజ్‌ను కలుసుకోవడం ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సుష్మాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఇవాంక.
- Advertisement -