- Advertisement -
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 టీ20ల్లో భాగంగా రెండో టీ20లోనూ భారత్ ఓటమి పాలైంది. భారత్ విధించిన 149 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో కేవలం 6 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించింది. క్వింటన్ డికాక్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన క్లాసెన్ చితక్కొట్టాడు. 46 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 7 ఫోర్లతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. కెప్టెన్ టెంబా బవుమా 35 ,డేవిడ్ మిల్లర్ 20 (నాటౌట్) పరుగులు చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 148 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 34, శ్రేయాస్ అయ్యర్ 40 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.
- Advertisement -