కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు 209 దేశాలకు పాకిన కరోనా మహమ్మారిపై పోరాడేందుకు మెజార్టీ దేశాలు లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో బోర్ కొడుతున్న వారు చేస్తున్న పనేంటో తెలిసి అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఫోన్లలో నీలి చిత్రాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. ప్రపంచంలోనే ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ అయిన పోర్న్ హబ్ తాజాగా ఓ జాబితాను విడుదల చేయగా భారత్ తొలి స్ధానంలో నిలిచింది.
భారత్‌లో లాక్ డౌన్ విధించిన తర్వాతే తమకు ఏకంగా దాదాపు 60 శాతానికిపైగా వీక్షకులు పెరిగారని వెల్లడించింది. అయితే, దీనికి కారణం ప్రజలు అందరూ ఖాళీగా ఇంట్లోనే ఉండటం అని తెలుస్తోంది. భారత్‌లో పోర్న్ సైట్లపై ఆంక్షలు ఉన్నా.. ప్రత్యేక మార్గాలు, డొమైన్ల ద్వారా పోర్న్ సైట్లను చూసేవారి సంఖ్య పెరిగిపోయిందని వెల్లడించింది. భారత్ తర్వాత స్ధానాల్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా ఉన్నాయి.