3వ వన్డేలో భారత్ ఘన విజయం..సిరీస్ కైవసం

224
india

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 7వికెట్ల తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది భారత్. ఆసీస్ విసిరిన 287 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్. నిర్ణిత 50 ఓవర్లలో ఆసీస్ 286పరుగులు చేసింది. 287పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. ఒపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో ఇండియా గెలుపులో కీలకం అయ్యాడు. 130బంతుత్లో 119 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఒత్తిడిని జయించి జట్టును విన్నింగ్ ట్రాక్ లో నిలబెట్టాడు. కోహ్లీ 89 పరుగులు చేసి హేజెల్ వుడ్ బౌలింగ్ బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులు చేశాడు. ఈ విజయంలో మూడు మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సిరీస్ లో అత్యధిక పరుగులతో రాణించిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.