అత్యధిక,అత్యల్ప మెజార్టీతో గెలిచింది వీరే!

24
- Advertisement -

దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారం చేపట్టగా బీజేపీ ఇచ్చిన 400 పార్ నినాదం పనిచేయలేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను భిన్నంగా ఇండియా కూటమి పుంజుకుంది.

ప్రధానంగా అయోధ్య రామాలయ నిర్మాణం ఎఫెక్ట్ పనిచేస్తుందని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. ఇక ఈ ఎన్నికల్లో అత్యధిక, స్వల్ప మెజార్టీతో గెలిచిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే..శంకర్ లాల్వాణీ (ఇండోర్-బీజేపీ) 11,75,092 మెజార్టీతో గెలుపొందారు.

తర్వాత స్థానంలో రబ్బీల్ హుస్సేన్ (ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476 ఓట్లతో, శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ-బీజేపీ) 8,21,408 ఓట్లతో, సీఆర్ పాటిల్ (నవసారి-బీజేపీ) 7,73,551 ఓట్లతో, అమిత్ షా (గాంధీనగర్-బీజేపీ) 7,44,716 ఓట్లతో, అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్-టీఎంసీ) 7,10,930 ఓట్లతో, రఘువీర్ రెడ్డి (నల్గొండ-కాంగ్రెస్) 5,59,905 ఓట్లతో గెలుపొందారు. వీరితో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు 4 లక్షలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఇక అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన వారి వివరాలను పరిశీలిస్తే…ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుండి శివసేన శిండే పార్టీ అభ్యర్థి రవీంద్ర…ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అభ్యర్థి అన్మోల్‌పై 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు పడటం విశేషం. ఇక కేరళలోని అత్తింగళ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ తన సమీప సీపీఎం అభ్యర్థి జాయ్‌పై 684 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఒడిశాలో బీజేపీ అభ్యర్థి రబీంద్ర తన సమీప బీజేడీ అభ్యర్థి సేథిపై 1587 ఓట్ల తేడాతో,రాజస్థాన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చోప్రా 1615,ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అభ్‌యర్థి భోజ్‌రాగ్…కాంగ్రెస్ అభ్యర్థి బీరేశ్ ఠాకూర్‌పై 1884 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ 18,669 ఓట్లు నోటాకు పడటం విశేషం.

Also Read:ఎన్డీయేతోనే ప్రయాణం:చంద్రబాబు

- Advertisement -