లాక్ డౌన్‌తో భారత్‌లో కరోనా కట్టడి….

200
india corona
- Advertisement -

కరోనాను నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా మే 3వరకు లాక్ డౌన్‌ను పొడగించిన సంగతి తెలిసిందే. నిన్న జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని ..ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్‌కు సహకరిస్తున్నారని తెలిపారు. భారత్‌లో లాక్ డౌన్ విధించకుంటే భారీ నష్టం జరిగేదని తెలిపారు.

తాజాగా దేశంలో లాక్ డౌన్ విధించడంపై రిపోర్టును విడుదల చేసింది కేంద్రం. భారత్ లాంటి పెద్ద దేశంలో లాక్ డౌన్ విధించకుంటే భారీ నష్టం జరిగేదని రిపోర్టులో వెల్లడించింది.మే 3వ‌ర‌కు కూడా అందరూ ఇంట్లోనూ ఉంటూ ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని సూచించింది.

లాక్ డౌన్ విధించడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఏప్రిల్ 15 వరకు అంటే నేటి వరకు 8 లక్షల కరోనా కేసులు నమోదయ్యేవని అంచనావేసింది. ఇక దేశంలో ఇప్పటివరకు కరోనాతో 399 మంది మరణించగా 11,439 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -