ఐ ఫర్ ఐ:మోడీ

191
India For Israel Says PM Modi
- Advertisement -

ఇజ్రాయెల్ కోసం ఇండియా….ఇండియా కోసం ఇజ్రాయెల్ పనిచేస్తుందని(ఐ కోసం ఐ) ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.  మూడు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా  అధ్యక్ష భవనానికి చేరుకున్న మోడీని..  రూవెన్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రొటోకాల్ ను పక్కనపెట్టి మరీ, నాకు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు… భారతీయులకు ఎంతటి గౌరవం లభించిందనడానికి ఇదే నిదర్శనం  పేర్కొన్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల గురించి చర్చించామని తెలిపారు.

అంతకముందు ఇజ్రాయెల్ చేరుకున్న మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ ఘనస్వాగతం పలికారు.  భారత్ తో స్నేహ సంబంధాలు తమకెంతో ప్రధానమని బెంజిమన్ చెప్పారు.ఇండియాలో 35 ఏళ్ల లోపు యువ జనాభా ఎక్కువగా ఉందని వారి నైపుణ్యంతో భారత్ ఎదుగుతుందని ప్రధాని మోడీ చెప్పారు. సాంకేతిక రంగంలో ఇజ్రాయెల్ సహకారం కావాలని కోరారు. ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు.

 India For Israel Says PM Modi
ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన ఓ పువ్వుకి భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టారు.  ఇజ్రాయెల్‌లో ప్రసిద్ధిచెందిన క్రైసాంతిమమ్‌ పువ్వుకి ‘మోడీ’ పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. మోడీఇజ్రాయెల్‌ చేరుకున్న అనంతరం ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహుతో కలిసి ‘డాంజిగర్‌’ పూలతోటను సందర్శించారు. డాంజిగర్‌ దేశంలోనే అతిపెద్ద ఫ్లోరికల్చర్‌ కంపెనీ. దాదాపు 80,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పూలతోట ఉంది. దీనిని 1963లో జెరూసలెంకి 56 కిమీల దూరంలో ఉన్న మోషావ్‌ మిష్మార్‌ హషివ ప్రాంతంలో కట్టించారు.

- Advertisement -