బీదర్ పార్లమెంట్ బరిలో అజారుద్దీన్

229
azaruddin
- Advertisement -

టీంఇండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ హైదరాబాద్ కు దగ్గరగా ఉండే కర్ణాటకలోని బీదర్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఆయన కర్ణాటకలోని స్ధానిక నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. అజారుద్దీన్ బీదర్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. బీదర్ లో ఎక్కువగా మైనార్టీలు ఉండటంతో అక్కడి నుంచి ఈజిగా గెలవచ్చని అజారుద్దీన్ భావిస్తున్నాడట. పైగా హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతవాసులతో   వారికి సంబంధాలు ఉన్నాయి.

కర్ణాటక కాంగ్రెస్ ప్రముఖ నేత మక్సూర్ తో పాటు పలువురు అధిష్టానం వద్ద ఈ ప్రతిపాదనను ఉంచినట్టు తెలుస్తుంది. మరో వైపు కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే కూడా బీదర్ సీటుపై కన్నేశారు. అధిష్టానం ఆదేశిస్తే తాను బీదర్ నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. బీదర్ పార్లమెంట్ స్ధానంపై కాంగ్రెస్ అధిష్టానం ఎవరిపై మెగ్గుచూపుతుందో చూడాలి. మరోవైపు అజారుద్దీన్ తెలంగాణలోని హైదరాబాద్ పార్లమెంట్ స్ధానం నుంచి పోటీ చేయవచ్చిన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్దుల లిస్ట్ ప్రకటించనుండటంతో ఈ పుకార్లకు బ్రేక్ పడనుంది. అజారుద్దీన్ 2009లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఎంపీగా గెలుపొందారు.

- Advertisement -