- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య 4వేలకు చేరాయి. గత 24 గంటల్లొ 3961 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. ఇవాళ ఉదయం 8 గంటల సమయానికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కి చేరాయి.
కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1435 కేసులు నమోదుకాగా మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్లో 338, పశ్చిమ బెంగాల్లో 331, కర్ణాటకలో 253 కేసులు వెలుగు చూశాయి.
గత 24 గంటల్లో నాలుగు మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున వైరస్ కారణంగా మరణించారు. ఇప్పటివరకు ఈ ఏడాది కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 32కి చేరింది.
Also Read:వీడియో..డల్లాస్లో కేటీఆర్ స్పీచ్
- Advertisement -

