కరోనా….అప్ డేట్స్

226
india coronavirus
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 213 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించగా పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,612కు చేరుకుంది.

ఇప్పటివరకు 3 లక్షల 43 వేల 804 మంది మృత్యువాతపడ్డారు. వ్యాధి నుంచి కోలుకుని 22 లక్షల 47 వేల 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 లక్షల 10 వేల 657.

ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1813కి చేరుకుంది. శనివారం కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది ఉండగా, మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులు 15 మంది, కువైట్‌ నుంచి వచ్చిన నలుగురు ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -