లాక్ డౌన్ పొడగించడమే మార్గం…

255
india corona
- Advertisement -

మే నెలలో దేశంలో కరోనా విజృంభన తీవ్రస్ధాయిలో ఉంటుందని ప్రొటివిటి అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ తన అధ్యయనంలో పేర్కొంది. మే 22 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 75వేల వరకు చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు కొనసాగించాలని అధ్యయనం సూచించింది.

లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించగలిగితే.. జూన్‌నెల మధ్యలోనే కేసులు సున్నాకు పడిపోతాయని పరిశోధకులు తేల్చారు.లాక్‌డౌన్‌ను మే 15వరకు పొడిగిస్తే సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు రోగుల సంఖ్య సున్నాకు తగ్గుతుంది.

దేశంలో ప్రస్తుతం మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగనుండగా దానిని పొడగించడమే మార్గమని పేర్కొంది. ప్రస్తుతం వివిధ వాతావరణ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది? వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? వంటి అంశాల ఆధారంగా అధ్యయన బృందం మూడు నమూనాలను రూపొందించింది.

- Advertisement -