ప్రపంచదేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 649 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వీరిలో 13 మంది మృతి చెందగా 42 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపింది. ఇక దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 123 , కేరళలో 118, కర్ణాటకలో 51 నమోదుకాగా తెలంగాణలో 41, గుజరాత్‌లో 38, రాజస్థాన్‌లో 38, ఉత్తరప్రదేశ్‌లో 38, ఢిల్లీలో 35, హర్యానాలో 31, పంజాబ్‌లో 31, తమిళనాడులో 26, మధ్యప్రదేశ్‌లో 21, లడఖ్‌లో 13, జమ్మూకశ్మీర్‌లో 11, ఏపీలో 10, బెంగాల్‌లో 10, చండీఘర్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 5, బీహార్‌లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 3, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 2, మణిపూర్, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.
ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో మొత్తం 21,116 కరోనా మరణాలు సంభవించాయి. ఇక కరోనా పాజిటివ్ కేసులు కూడా 5 లక్షలకు చేరువయ్యాయి. 81,285 కేసులతో చైనా మొదటి స్థానంలో ఉండగా 74,386 కేసులతో ఇటలీ ఆ తర్వాత స్థానంలో ఉంది.