టీమిండియా 336 ఆలౌట్‌..

131
india
- Advertisement -

టీమిండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ 336 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్సు లో ఆస్ట్రేలియా 369 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 33 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌న‌బ‌ర్చింది. ఇక ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తూ లోయర్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ చూపించిన తెగువ‌తో బ్రిస్బేన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌‌లో టీమిండియా మంచి స్కోరే చేసింది. శార్దూల్ ఠాకూర్(67)‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ (62) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిపోయారు.ఈ ఇద్ద‌రూ ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగి ఏడో వికెట్‌కు ఏకంగా 123 ప‌రుగులు జోడించ‌డం విశేషం. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా తొలి టెస్ట్ ఆడుతున్న సుంద‌ర్.. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాలో రోహిత్ శర్మ 44, శుభమన్ గిల్ 7, ఛటేశ్వర్ పుజారా 25, అజింక్యా రహానే 37, మయాంక్ అగర్వాల్ 38, పంత్ 23, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 62, శార్దూల్ ఠాకూర్ 67, సైనీ 5, సిరాజ్ 13, న‌ట‌రాజ‌న్ 1 (నాటౌట్) ప‌రుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 14 ప‌రుగులు వ‌చ్చాయి. ఆసీస్ బౌలర్లలో జోష్‌ కు ఐదు, స్టార్క్, కమిన్స్, స్టార్ కు రెండేసి, లైయ‌న్ కు ఓ వికెట్ ద‌క్కాయి. ఆ త‌ర్వాత రెండో ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 21 ప‌రుగులు చేసింది. వార్నర్ 20, హారిస్ 1 ప‌రుగుతో క్రీజులో ఉన్నారు. ఓవ‌రాల్‌గా ఆస్ట్రేలియా 54 ప‌రుగుల లీడ్‌లో ఉంది.

- Advertisement -