రాజ్ కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత జట్టు 272 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ ను 649 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండిస్ తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీంతో ఫాలో ఆన్ ప్రారంభించిన విండిస్ మరో 196 పరుగులకే చాప చుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో విండిస్ జట్టు కేవలం 51 ఓవర్లు మాత్రమే ఆడటం గమనార్హం.
విండీస్ వికెట్ల పతనం: 94/6 పరుగుల స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన విండీస్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. కీమో పాల్‌ను (47; 49 బంతుల్లో 7×4, 2×6) ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. అనంతరం దేవేంద్ర బిషూ క్రీజులోకి వచ్చాడు. ఇక భారత బౌలర్లకు అడ్డంకిగా మారిన రోస్టన్ చేజ్ (53; 59బంతుల్లో 8×4)ను అశ్విన్ 43.2 ఓవర్ వద్ద బౌల్డ్ చేయడంతో పెవిలియన్ చేరాడు. అప్పటికి విండీస్ స్కోర్ 159/8. అనంతరం క్రీజులోకి వచ్చిన షెర్మన్ లూయిస్‌ను స్వల్ప వ్యవధిలోనే అశ్విన్ ఔట్ చేశాడు. 43.5ఓవర్లో అశ్విన్ వేసిన బంతికి లూయిస్ బౌల్డ్ అయ్యాడు. గాబ్రియల్(1; 10 బంతుల్లో) 47.6 వద్ద స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో 48 ఓవర్లు పూర్తయ్యే సరికి 181 పరుగులకే విండీస్ ఆలౌట్ అయ్యింది. దేవేంద్ర బిషూ (17;26 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచాడు.