అక్షర్ పటేల్ మ్యాజిక్..భారత్ గెలుపు

91
ind
- Advertisement -

వెస్టిండీస్‌లో టూర్‌లో భాగంగా రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది భౄరత్. 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో 2 వికెట్లు ఉండగానే 49.4 ఓవర్లలో చేధించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ విశ్వరూపం చూపించాడు. కేవలం 35 బంతుల్లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 64 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శ్రేయస్‌ అయ్యర్ 63)‌, సంజూ శాంసన్‌ (54) ,దీపక్ హుడా 33 పరుగులతో రాణించారు. తన కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన అక్షర్ ….ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇక అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండిస్‌ 310 పరుగులు చేసింది. ఓపెనర్‌ షై హోప్‌ (115; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్‌ సెంచరీకి తోడు నికోలస్‌ పూరన్‌ (74; ఒక ఫోర్‌, 6 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించడంతో విండీస్ భారీ స్కోరు సాధించింది.

- Advertisement -