వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సెమీస్‌లోకి ప్రవేశించింది భారత్. 7 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించగా కీలక మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసింది భారత్. 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేయగా భారీ లక్ష్య చేధనలో శ్రీలంక తేలిపోయింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. రజిత (14), తీక్షణ (12 నాటౌట్), మాథ్యూస్ (12) విఫలం కాగా 5గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. మహమ్మద్ షమీ 5, సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టారు.
ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. గిల్ (92), కోహ్లీ (88),శ్రేయాస్ అయ్యార్ 56 బంతుల్లో 6 సిక్స్‌లు,3 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. చివర్లో జడేజా 35 పరుగులు చేయడంతో భారత్ 350 పరుగులు దాటింది. లంక బౌలర్లలో మధుషనక 5 వికెట్లు పడగొట్టాడు. షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా భారత్ తన తదుపరి మ్యాచ్ ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Also Read:Karthi:‘జపాన్’యూనివర్సల్ ఎంటర్‌టైనర్