దక్షిణాఫ్రికాపై భారత్‌ తొలి విజయం..

67

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ సత్తా చాటింది. దక్షిణాఫ్రికాపై భారత్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది. టీమిండియా నిర్దేశించిన 305 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది.

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవరూ రాణించలేదు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి ఇండియాను మెరుగైన స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ కాగా… దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌట్ అయింది.

సెంచూరియన్‌ గ్రౌండ్‌లో అత్యధికంగా 334 బంతులు ఎదుర్కొన్న తొలి విదేశీ ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డు సృష్టించాడు. ఈ వేదికపై ఎక్కువ బంతులు ఆడిన పర్యాటక జట్టు ఆటగాడిగా రెండో స్థానంలో నిలిచాడు. ఆసీస్‌కు చెందిన షాన్‌ మార్ష్‌ (372) అత్యధిక బంతులు ఎదుర్కొన్నాడు. ఇక, బుమ్రా మహారాజ్ వికెట్ తో విదేశాల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.