దాయాది పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా

38
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన దాయాదుల పోరులో పైచేయి సాధించింది టీమిండియా. 120 పరుగల స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్..113 పరుగులకే పరిమితమైంది. ఓ దశలో 73/3 పరుగులతో గెలుపు దిశగా వెళ్తున్న పాకిస్థాన్‌ను మట్టికరిపించాడు బుమ్రా. అద్బుత స్పెల్‌తో మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

పాక్ ఆటగాళ్లలో రిజ్వాన్ 31,బాబర్ అజామ్ 13,ఉస్మాన్ ఖాన్ 13,ఫకర్ జమాన్ 13,ఇమాద్ వసీం 15 పరుగులు చేశారు. బుమ్రా 3,పాండ్యా 2,అర్షదీప్ సింగ్,అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది.పంత్ 42 పరుగులతో రాణించగా అక్షర్ పటేల్ 20 పరుగులు చేశారు. అయితే మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే తక్కువ స్కోరు అయినా లక్ష్యాన్ని డిఫెండ్ చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.

Also Read:నరేంద్ర మోడీ…అనే నేను

- Advertisement -