ప్రతీకారం తీర్చుకున్న భారత్..

121
hardik
- Advertisement -

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. పది నెలల క్రితం ఇదే మైదానంలో పాక్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ విధించిన 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 148 పరుగులు చేసి విజయం సాధించింది.

కేఎల్‌ రాహుల్‌ (0) ఖాతా తెరువకుండానే వెనుదిరగగా విరాట్‌ కోహ్లీ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. రోహిత్‌ శర్మ (12) , రవీంద్ర జడేజా (29 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఇక అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. భువనేశ్వర్‌ కుమార్‌ (4/26), హార్దిక్‌ పాండ్యా (3/25) ధాటికి కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (43; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌. పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

- Advertisement -