Asia Cup: ఒమన్‌పై భారత్ గెలుపు

7
- Advertisement -

ఆసియా కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ మ్యాచ్‌ల్లో మూడింటికి మూడు గెలిచి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది భారత్. ఇక గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ ఒమన్‌తో తలపడింది భారత్.

భారత్ విధించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. ఖలీమ్ 64 పరుగులు చేయగా మిర్జా 51 పరుగులు చేశారు. భారత బౌలర్లలో పాండ్యా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 188 రన్స్ చేసింది. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 45 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 26 రన్స్ చేశారు.

Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -