ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. తొలి టీ20లో బుమ్రా నేతృత్వంలోని టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగలేదు. 140 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 6.5 ఓవర్లలో 47/2తో ఉన్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్) రాణించారు. వర్షం ఎంతకు ఆగకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్‌ని విజేతగా ప్రకటించారు.
అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెక్‌కార్టీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కార్టీస్ కాంఫర్ (39; 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం రెండో టీ20 జరగనుంది.
Also Read:బీఆర్ఎస్ లిస్ట్ రెడీ.. వారికే ప్రాధాన్యత?