పదేళ్ల తర్వాత ఫైనల్‌కు టీమిండియా

7
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది టీమిండియా. పదేళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన టీమిండియా టైటిల్ వేటలో అడుగుదూరంలో నిలిచింది. టీమిండియా విధించిన 172 పరుగుల లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఏ దశలోనూ టార్గెట్‌ను చేధించే దిశగా ముందుకు సాగలేదు. ముఖ్యంగా భారత స్పిన్నర్ల ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ వెలవెలలాడారు. దీంతో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది.అక్షర్‌పటేల్‌(3/14), కుల్దీప్‌యాదవ్‌(3/19) మూడు వికెట్లు తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌శర్మ 39 బంతుల్లో 57 పరుగులు చేయగా సూర్యకుమార్‌యాదవ్‌ 36 బంతుల్లో 47 పరుగులు చేశారు. అక్షర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Also Read:‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ …సెకండ్ లుక్

- Advertisement -