ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ని మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది భారత్. కీలక రెండో వన్డేలో భారత్ ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టింది.డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్ టార్గెట్ 33 ఓవర్లలో 317గా నిర్ణయించగా ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 99 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0),లబుషేన్ (27), వార్నర్ (53), జోష్ ఇంగ్లిస్ (6) పరుగులు చేశారు. ఓ దశలో 140 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింద ఆసీస్ అయితే సీన్ అబాట్ 36 బంతుల్లో 54, హేజిల్ వుడ్ 16 బంతుల్లో 23 రన్స్ చేయడంతో 200 పరుగులు దాటింది. అశ్విన్, జడేజా తలో మూడు వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 2, మహమ్మద్ షమీ ఓ వికెట్ పడగొట్టారు.
ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఆరంభం నుండే ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు భారత బ్యాట్స్‌మెన్. గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6) , శ్రేయస్ అయ్యర్. . 90 బంతుల్లోనే 105 పరుగులు చేసి సత్తాచాటాడు. కెప్టెన్ రాహుల్ (52; 38 బంతుల్లో 3×4, 3×6) , సూర్య కుమార్ యాదవ్ 37 బంతుల్లో 72 పరుగులు చేశాడు.
Also Read:టీడీపీకి జగన్ పూర్తిగా చెక్ పెట్టినట్లేనా ?