మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీ సేన ఘనవిజయం సాధించింది. భారత బౌలర్లు,భారీ టార్గెట్ ఛేదనలో ఆసీస్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. దీంతో భారత్ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రెండో టెస్టులో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.భారత బౌలర్లలో బుమ్రా, జడేజా మూడేసి.. షమీ, ఇషాంత్ రెండేసి వికెట్లు తీశారు.
ఓవర్ నైట్ స్కోరు 258/8 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ మరో మూడు పరుగులు మాత్రమే జోడించి మిగితా రెండు వికెట్లను కొల్పోయి 261 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యమైనప్పటికీ విజయం వరించడానికి మాత్రం ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్ (63), లైయన్ (7) ఔటవ్వడంతో భారత్ విజయం లాంఛనమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 443/7 డిక్లేర్డ్
రెండో ఇన్నింగ్స్: 106/8 డిక్లేర్డ్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 151
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ : 261