కారెక్కిన రామగుండం,వైరా ఎమ్మెల్యేలు

221
trs
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది.దాదాపు ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోయే స్థాయిలో గులాబీ పార్టీ అభ్యర్థులు విజయబావుట ఎగురవేశారు. 88 స్ధానాలతో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించగా తాజాగా ఇండిపెండెంట్లుగా గెలిచిన వైరా,రామగుండం ఎమ్మెల్యేలు కారెక్కారు.దీంతో టీఆర్ఎస్ బలం 90కి చేరింది.

రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్‌ కేటీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వైరా నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కపోవడంతో రాములు నాయక్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో కోరుకంటి చందర్‌ రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై గెలిచారు.

ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ పీడీ యాక్టులతో ఇబ్బంది పెట్టిన వెనకడుగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు మా నాయకుడు కేసీఆరే అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోరుకుంటి చందర్. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేటీఆర్‌ను కలిసి నా మద్దతు తెలిపానని వెల్లడించారు.

- Advertisement -