స్వాతంత్య్ర పోరాటం..బాలీవుడ్ టాప్ సినిమాలివే

30
- Advertisement -

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు అవుతోంది. 76 సంవత్సరాలుగా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతుండగా ఇన్ని సంవత్సరాల్లో దేశ భక్తిని రగల్చే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొస్తే.. ఇప్పుడు మనం హాయిగా బతుకుతున్నాం. అలాంటి మహానీయుల త్యాగాలను వెండితెరపై అద్భుతంగా తెరకెక్కించి ప్రజల్లో దేశ భక్తిని మరింతగా పెంపొందించారు. అలాంటి బాలీవుడ్ సినిమాలెంటో ఓ సారి చూద్దాం..

()’మదర్ ఇండియా’….భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ల తర్వాత ఫిబ్రవరి 1957లో విడుదలైంది. మానవ హక్కులు, సమానత్వం మరియు అణగారిన వర్గాల అణచివేత ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించారు. స్వతంత్ర భారతదేశంలో రైతుల పోరాటాలను చూపించగా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఇందులో నర్గీస్, రాజ్ కుమార్, రాజేంద్ర కుమార్ ,సునీల్ దత్ కీలక పాత్రల్లో నటించారు.

()’నయా దౌర్’ …గ్రామీణ భారతదేశంలో సంఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కింది. గుర్రపు బండ్ల స్థానంలో బస్సులు పెట్టి తన వ్యాపారాన్ని ఆధునీకరించాలని ఒక భూస్వామి కుమారుడు నిర్ణయించుకున్నప్పుడు, అతనికి గుర్రపు బండి నడిపే వ్యక్తి సవాలు చేస్తాడు. దిలీప్ కుమార్ నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది.

()భారత్…మనోజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా ఈ నిలిచిన ఈ చిత్రం జాతీయ అవార్డులను కూడా కైవసం చేసుకుంది. మనోజ్ కుమార్ భరత్ పాత్రలో నటించారు.

()’సాత్ హిందుస్థానీ’….KA అబ్బాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గోవా విముక్తి పోరాటం నేపథ్యంలో రూపొందించబడింది. అమితాబ్ బచ్చన్ బిగ్ స్క్రీన్ అరంగేట్రం చేసిన చిత్రం పోర్చుగీస్ పాలన నుండి గోవా విముక్తిలో నిమగ్నమైన ఏడుగురు సైనికుల చుట్టూ కథ తిరుగుతుంది.

()’పురబ్ ఔర్ పశ్చిమ్’….మనోజ్ కుమార్ ప్రధానపాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. నటుడే స్వయంగా దర్శకత్వం వహించగా సైరా బాను, అశోక్ కుమార్ మరియు ప్రాణ్ కీలక పాత్ర పోషించారు ..

()’సరిహద్దు'(Boarder)…1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. సన్నీ డియోల్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, జాకీ ష్రాఫ్, రాఖీ మరియు టబు ప్రధానపాత్ర పోషించగా అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకుంది ఈ చిత్రం.

()‘సర్ఫరోష్’….. జాన్ మాథ్యూ మత్తన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ సింగ్ రాథోడ్, అమీర్ ఖాన్ మెరిశారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సర్ఫరోష్ 1999లో విడుదలైంది, కార్గిల్ యుద్ధం జరిగిన ఒక సంవత్సరం తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు ఇతివృత్తంగా తెరకెక్కింది.

()రంగ్ దే పసంది…..రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా రూపొందించిన ఈ చిత్రం స్వాతంత్య్ర సమరయోధులపై డాక్యుమెంటరీ నేపథ్యంగా తెరకెక్కింది.

()స్వదేశ్… షారూఖ్ ఖాన్ నాసా శాస్త్రవేత్తగా తెరకెక్కింది ఈ చిత్రం. స్వాతంత్ర్య అనంతరం భారతదేశంలో వస్తున్న మార్పుల ఆధారంగా తెరకెక్కింది.

()లక్ష్య…1999 కార్గిల్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించారు.హృతిక్ రోషన్, ప్రీతి జింటా, బోమన్ ఇరానీ మరియు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హృతిక్ రోషన్ మొదటిసారిగా ఇండియన్ ఆర్మీ సైనికుడి పాత్రను పోషించగా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది.

()shershaah….కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ఈ చిత్రం 2021లో అత్యంత పాపులరైన చిత్రాల్లో ఒకటి. కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా, పాకిస్తానీ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే ఇతివృత్తంగా వచ్చింది.

()లగాన్….అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. భారతదేశంలో నిర్మించిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది. అమీర్ ఖాన్ , గ్రేసీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్రిటీష్ ప్రభుత్వంచే అధిక పన్నుల భారం పడుతున్న గ్రామస్థుల చుట్టూ కథాంశం తిరుగుతుంది. పన్ను రాయితీ పొందడానికి, గ్రామస్తులు బ్రిటిష్ వారితో క్రికెట్ మ్యాచ్ ప్రతిపాదనను తీసుకురాగా ఈ మ్యాచ్లో అమీర్ ఖాన్ ఎలా గెలుస్తారనేది కథాంశం.

Also Read:షర్మిల కండిషన్స్.. పాలేరు కోసమే?

()మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ…యోధురాలు రాణి లక్ష్మీ బాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించారు. 2019 సంవత్సరంలో విడుదలైన ఈ పీరియాడికల్ డ్రామా చిత్రంలో బ్రిటీష్ వారిపై ఝాన్సీ రాణి చేసిన ధైర్య పోరాటాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

()ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్….2002లో విడుదలైన ఈ సినిమా బ్రిటిష్ రాజ్‌కి వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సుశాంత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటనకు గాను అజయ్ జాతీయ అవార్డును అందుకున్నారు.

()మంగళ్ పాండే: ది రైజింగ్…భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారతీయ సైనికుడు మంగళ్ పాండే జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమీర్ ఖాన్, అమీషా పటేల్ మరియు రాణి ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించగా 2005లో విడుదలైంది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు.

()గాంధీ….1982లో విడుదలైన ఈ చిత్రం బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అహింసాయుత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించిన స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెన్ కింగ్స్లీ ప్రధాన పాత్రలో నటించారు.

Also Read:బీరకాయ తింటే ఆ సమస్యలు దూరం!

- Advertisement -