చైనాను దాటం..సమస్యలు అధిగమిస్తామా?

27
- Advertisement -

ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో అగ్రస్ధానంలో ఉంది భారత్. చైనా జనాభా 142 కోట్ల 57 లక్షలుగా ఉంటే భారత దేశ జనాభా 142 కోట్ల 86 లక్షలకు చేరుకుంది.జనాభాలో ఒకటో స్థానంలో, వైశాల్యములో ఏడవస్థానంలో ఉండగా ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం గల దేశం. 30 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలsy ఎక్కువ సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటి.

దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. స్వ‌తంత్రం వ‌చ్చే నాటికి దేశ జ‌నాభా 33 కోట్లు కాగా 76 సంవత్సరాల తర్వాత దేశ జనాభా 142 కోట్లు దాటింది. యాభై యేళ్ల కింద‌టి వ‌ర‌కూ ఒక్కో జంట ఐదారు మంది పిల్ల‌ల‌ను క‌నడం సంప్ర‌దాయంగా ఉన్న దేశం మ‌న‌ది. ఫ‌లితంగా జ‌నాభా పెరుగుద‌ల రేటు భారీగా న‌మోదు అవుతూ వ‌చ్చింది. ఇప్పుడు రోజులు మారాయి. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు ప‌రిమితం కావ‌డం, వీలైతే ఒక్క‌రే చాలనుకునే ప‌రిస్థితి వచ్చింది.

జనాభా విస్ఫోటనం మన భవిష్యత్ తరాలకు అనేక సమస్యలను కలిగిస్తుంది. జనాభా విస్ఫోటనం గురించి మనం ఆందోళన చెందాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అధిగమించేందుకు పథకాలు ప్రారంభించాలి. మన సహజ వనరులు చాలా భారంగా ఉన్నాయి. ఏదైనా దేశం యొక్క వృద్ధి రేటు నేరుగా దాని జనాభా పరిమాణానికి సంబంధించినది. అధిక జనాభా కారణంగా గాలి, నీరు, భూమి, అడవులు మొదలైన సహజ వనరులు అతిగా దోపిడీకి గురవుతున్నాయి.

Also Read:గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ…మార్గదర్శకాలివే

దీనికి తోడు పెరుగుతున్న జనాభా అనేక సవాళ్లను తెచ్చిపెట్టనుంది. ముఖ్యంగా వనరుల కొరత, నీటి కొరత ఏర్పడవచ్చు. వ్యవసాయ ఉత్పాదకత, పర్యావరణం క్షీణించే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ, రవాణా, ఆరోగ్య, విద్యా సౌకర్యాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను విస్తరించాల్సి ఉంటుంది. లేకపోతే జనాభాలో ఎక్కువ భాగం దుర్భరమైన పరిస్థితుల్లో జీవించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. రావచ్చు. జనాభా పెరుగుతుంటే పని చేయగల సామర్థ్యం ఉన్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం సవాలుగా మారుతుంది. దీనివల్ల ఆర్థిక అసమానతలు, పేదరికం పెచ్చుమీరుతాయి. సామాజిక అస్థిరత, అశాంతి చోటుచేసుకోవచ్చు.

దేశంలో 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు మొత్తం జనాభాలో 40 శాతం మంది ఉండగా 25 ఏళ్ల నుంచి 64 ఏళ్లున్న వారు మొత్తం జనాభాలో సగం మంది ఉన్నారు. వృద్ధులు అంటే 65 ఏళ్లు పైబడిన వారు మొత్తం జనాభాలో కేవలం 7 శాతం మంది మాత్రమే. ప్రస్తుతం దేశంలో జనాభా వృద్ధి రేటు పడిపోతోంది కాబట్టి, రాబోయే దశాబ్దాలలో జనాభాలో ఎక్కువ భాగం వృద్ధులే అవుతారనే ఆందోళనలు ఉన్నాయి.అయితే తర్వాతి కాలంలో ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, వారి జనాభాలో యువత ఉంటారు.

Also Read:పచ్చి అరటికాయ తింటే ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -