హరితనగరంగా హైదరాబాద్‌: మేయర్ రామ్మోహన్‌

631
bonthu rammohan
- Advertisement -

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలోనే హైద‌రాబాద్ న‌గ‌రం గ‌తంలో మ‌రెప్పుడూలేని విధంగా అభివృద్ది ప‌థంలో దూసుకుపోతుందన్నారు మేయర్ బొంతు రామ్మోహన్‌. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడిన మేయర్ దార్శ‌నికుడు, ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ మార్గ‌ద్శ‌క‌త్వంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో దాదాపు 40వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో ప‌లు అభివృద్ది ప‌నులు జ‌రుగుతున్నాయని తెలిపారు.

విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్ లో నగరవాసుల జీవన ప్రమాణాలను మరింత పెంచేందుకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హరితహారంలో భాగంగా మూడు కోట్ల మొక్కలను నాటడం, ఉచితంగా పంపిణీ చేయడం, 53 థీమ్ పార్కుల నిర్మాణం, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం, లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు.

సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ వ్యవస్థ రూపొందించేందుకుగాను హైదరాబాద్ నగరంలో ర ఎస్.ఆర్.డి.పి పనులు చేపట్టాం. వీటిలో ప్రస్తుతం ఇప్పటికే నాలుగు ఫ్లై ఓవర్లు మైండ్ స్పేస్ జంక్షన్, జె.ఎన్.టి.యు రాజీవ్ గాంధీ ఫ్లై ఓవర్, కామినేని జంక్షన్, ఎల్బీనగర్ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. మరో మూడు అండర్ పాసులు మైండ్స్ స్పేస్, అయ్యప్ప సొసైటి, చింతల్ కుంటల వద్ద అండర్ పాసులు ప్రారంభించడం జరిగిందన్నారు.

హైదరాబాద్ నగరాన్ని హరిత నగరంగా చేపట్టేందుకుగాను ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల హరితహారంలో 2.21 కోట్ల మొక్కలను నాటడం, పంపిణీ చేయగా ప్రస్తుత హరితహారంలో మూడు కోట్ల మొక్కలను ఉచితంగా పంపిణీతో పాటు నగరంలోని ఖాళీ స్థలాల్లో నాటాలని ప్రణాళికలు రూపొందించాం. రూ. 137 కోట్ల వ్యయంతో 51 హరితహారం థీమ్ పార్కులను కొత్తగా నిర్మిస్తున్నాం. వీటితో పాటు రూ. 17.75 కోట్ల వ్యయంతో నగర శివారులలోని ఫారెస్ట్ బ్లాక్ లలో మూడు అర్బన్ ఫారెస్ట్ పార్కులను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో నిరుపేదలు నివసించే బస్తీలలో ఉచిత వైద్య పరీక్షలు అందించేందుకుగాను ప్రతి రెండు వేల మందికి ఒక బస్తీ దవాఖానను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే నగరంలో 106 బస్తీ దవాఖానలు ప్రారంభించాం. మరో 90కి పైగా బస్తీ దవాఖానలను త్వరలోనే ప్రారంభించనున్నాం… నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా కొల్లూరులో చేపట్టిన 15,600 డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీ దేశంలోనే మరెక్కడాలేదన్నారు.

విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్‌ను తీర్చిదిద్ద‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌ను ఇస్తోందన్నారు డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్ . స్వాతంత్ర ఉద్య‌మం, ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తితో హైద‌రాబాద్ స‌మగ్రాభివృద్దికి కృషిచేయాలి… విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌తిఒక్క‌రం కృషి చేయాలని చెప్పారు.

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దానకిషోర్ మాట్లాడుతూ…హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప‌నిచేయాలంటే వివిధ శాఖల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌రం.  గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న స్వయం సహాయక మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు జిహెచ్ఎంసి చేపడుతున్న పలు పథకాల్లో భాగస్వామ్యం చేయనున్నామన్నారు. అర్బ‌న్ క‌మ్యునిటీ డెవ‌లప్‌మెంట్ విభాగం ద్వారా విక‌లాంగుల‌కు వీల్‌ఛైర్‌లు, నిరుద్యోగుల‌కు ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు, వృద్దుల‌కు ఆస‌రా గుర్తింపు కార్డులు అంద‌జేశారు. కమీషనర్ ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకట రమణ, సీపీఆర్ఓ విభాగం నుండి సెనియర్ అసిస్టెంట్లు సునందినీ, శ్రీనివాస్ లకు, బుక్ బైండర్ విశ్ను, ఆఫీస్ సబార్డినెట్ విజయలక్ష్మి లతో పాటు 75మందికి ప్రశంశా పత్రాలను మేయర్ బొంతు రామమోహన్, డెప్యూటి మెయర్ బాబా ఫసియొద్దిన్, కమిషనరు దాన కిషోర్ లు అందచేశారు.

- Advertisement -